ఏడాదిలోపే మంచి పరిపాలన-జగన్

ఏడాదిలోపే మంచి పరిపాలన-జగన్

ఇంత అపురూపమైన విజయం సాధించడం ఏపీ చరిత్రలోనే ఇదో సంచలన విజయం అన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడియన జగన్... ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ... ప్రజల దీవెనలు, దేవుడి అశీస్సులతోనే గెలుపు సాధ్యమైందన్నారు. ఏపీ చరిత్రలో ఇదో సంచలన విజయమని పేర్కొన్న జగన్... మంచి పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాం... ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మంచి పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఈ విజయం ఓ కొత్త అధ్యాయంగా అభివర్ణించిన జగన్... ఈ విజయం నాపై మరింత బాధ్యత పెంచింది... ప్రజలు విశ్వసనీయతకే ఓటు వేవారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పనిచేసిన... ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు గెలుచుకోవడం... 175 ఎమ్మెల్యే స్థానాలకు 150కి పైగా ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించబోవడం ఓ కొత్త చరిత్ర అన్నారు జగన్.