బాబుకు ఆ దేవుడే బుద్ధి చెప్పాడు..

బాబుకు ఆ దేవుడే బుద్ధి చెప్పాడు..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం నా ఒక్కడి విజయం కాదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... వైఎస్ఆర్సీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించిన మాట్లాడిన జగన్... ఒకే సారి 151 మంది ఎమ్మెల్యేలను చూస్తుంటే వెంట్రుకలు లేచినిలబడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కిందటి ఆ రోజు నాకు బాగా గుర్తుంది.. టీడీపీకి మనకు వచ్చిన ఒక్క శాతం ఓట్ల తేడా, 5 లక్షల ఓట్లు.. మనందరినీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టాయన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు అరచకాలు, అన్యాయలు అన్నీ చూశాం.. ధర్నాలు, దీక్షలు చేశాం... ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం.. చివరకు సుదీర్ఘమైన 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు. 

ఐదేళ్ల చంద్రబాబు పానలతో పాటు అంతమకు ముందు నాలుగేళ్లు మొత్తం తొమ్మిదేళ్లు ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది... జగన్ ప్రతీ సమస్యపై ప్రజల పక్షాన నిలబడ్డామని... అవన్నీచేసే ప్రజల అభిమాన్ని చురగొన్నామని గుర్తుచేశారు వైఎస్  జగన్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీల్లో 151 స్థానాల్లో గెలిచామంటే.. 25 లోక్‌సభ స్థానాల్లో 22 స్థానాలు విజయం సాధించామంటే ఇది మామూలు విజయం కాదన్న జగన్.. 50 శాతం ఓట్లు సాధించామంటే హిస్టరీలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక అన్యాయం చేస్తే దేవుడు ఏ విధంగా శిక్షస్తాడు చంద్రబాబు చూస్తే అర్థమవుతుందన్నారు. చంద్రబాబు మన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే... 23వ తేదీన ఆయనకే 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు... ముగ్గురు ఎంపీలను తన పార్టీలో చేర్చుకుంటే... ఆయనకు ముగ్గురు ఎంపీలనే మిగిల్చాడు. చంద్రబాబుకు దేవుడు తగిన బుద్ధిచెప్పాడు.. ఆ దేవుడు రాసిన స్క్రిప్టు ఇంతకన్నా గొప్పగా ఉండదేమోనని వ్యాఖ్యానించారు జగన్.