నేడు కేసీఆర్‌తో జగన్ భేటీ..

నేడు కేసీఆర్‌తో జగన్ భేటీ..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏపీలో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. గురువారం కేసీఆర్ జగన్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా.. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు రానున్నారు వైసీపీ అధినేత.