ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు..

ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు గవర్నర్ తో సమావేశమై ఫిర్యాదు చేయనున్నారు జగన్. రాష్ట్రంలో టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి వైసీపీ నేతల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంల భద్రతకై రాష్ట్రానికి అదనపు బలగాలు కేటాయించాలని సీఈసీని వైసీపీ నేతలు కోరారు. ప్రధానంగా ఈ వీటిపైనే గవర్నర్‌తో వైఎస్ జగన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.