రేపు మోడీ-జగన్ భేటీ..

రేపు మోడీ-జగన్ భేటీ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... ఈ నెల 26వ తేదీన హస్తినకు వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు జగన్... ఇవాళ సమావేశం కానున్న వైసీపీ ఎమ్మెల్యేలు... జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనుండగా... ఈ నెల 30వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు జగన్. అయితే, తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు జగన్. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌ను మోడీ ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో భేటీ కోసం రేపు ఉదయాన్నే ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.