హ్యాపీ బర్త్ డే 'నాన్నా'

హ్యాపీ బర్త్ డే 'నాన్నా'

నేడు మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. తన తండ్రి వైఎస్ పుట్టిన రోజు నాడే తాను చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకోనుందని తెలిపారు. ఇది కేవలం యాధృచ్ఛికమే కాదు, రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని చెబుతోందన్నారు. స్వర్గం నుంచి నాన్న ఆశీర్వదించారు. 'హ్యాపీ బర్త్‌డే నాన్న'. ఎల్లప్పుడూ తమకు అండగా  నిలిచినందుకు కృతజ్ఞతలు అని జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యంత ప్రతిస్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటితో 208వ రోజుకు చేరుకుంది.