జగన్ నివాసానికి 'జగన్, ఏపీ సీఎం' నేమ్‌ బోర్డు..

జగన్ నివాసానికి 'జగన్, ఏపీ సీఎం' నేమ్‌ బోర్డు..

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 150 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందుంజలో ఉన్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఇంగ్లీష్‌లో ముద్రించిన నేమ్‌ బోర్డును జగన్ నివాసానికి తీసుకువచ్చారు అభిమానులు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ముందు ఈ నేమ్ బోర్డును చూపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.