నేడు జగన్ పాదయాత్ర సాగనుంది ఇలా...

నేడు జగన్ పాదయాత్ర సాగనుంది ఇలా...

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 192వ రోజుకు చేరుకుంది... ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండగా... నేడు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర సాగుతోంది. గంటిపెదపూడి, ఉచ్చులవారిపేట, ఉడుమూడి, బెల్లంపూడి, బోడపాటివారిపాలెం మీదుగా పి.గన్నవరం వరకు ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం పి.గన్నవరంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించనున్నారు.