హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌

హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. వైఎస్ జగన్ ఫిబ్రవరి 21 ఉదయం లండన్ చేరుకున్నారు. లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న తన పెద్ద కుమార్తెను చూసేందుకు వైఎస్ జగన్.. భార్య భారతి, చిన్న కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. జగన్ లండన్ పర్యటన ముగించుకుని ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.