ఢిల్లీ చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి అధికార నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ వెళతారు. ఉదయం 10.40 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోడీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్ర సహాయం, ప్రత్యేక హోదా గురించి జగన్ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనపు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ లో పలువురు అధికారులు, ఢిల్లీలోని ప్రముఖులతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి ఏపీకి ప్రయాణమవుతారు.