బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న వైఎస్ జగన్ 

బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న వైఎస్ జగన్ 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా జగన్‌ బృందం రాజ్‌భవన్‌ చేరుకొని గవర్నర్‌తో సమావేశం కానుంది. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ప్రమాణస్వీకారోత్సవానికి జగన్‌ ఆహ్వానించనున్నారు. జగన్‌ వెంట పలువురు వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు.