వైఎస్ జయంతి : ఏపీ సీఎం జగన్ షెడ్యూల్ ఇదే 

వైఎస్ జయంతి : ఏపీ సీఎం జగన్ షెడ్యూల్ ఇదే 

నేడు ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సంధర్భంగా  కుటుంబసభ్యులతో కలసి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. అనంతరం ట్రిబుల్ ఐటీలో వైఎస్ఆర్ విగ్రాహావిష్కరణతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నారు జగన్. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయ ప్రాంతానికి వెళ్లే మార్గంలో క్షున్నంగా తనిఖీలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు చేయించుకొని ముందస్తు అనుమతి ఉన్నవారికే ప్రవేశం ఉండనుంది. 
షెడ్యూల్ :

  • ఉదయాన్నే సీఎం వైఎస్సార్‌ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కాన్వాయ్‌ ద్వారా ట్రిపుల్‌ఐటీకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. 
  • ఇందులో భాగంగా ట్రిపుల్‌ఐటీలో రూ.139 కోట్లతో నిర్మించిన వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల గదుల సముదాయాన్ని, మూడు మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 
  • రూ.40 కోట్లతో నిర్మించతలపెట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆడిటోరియం, రూ.10 కోట్లతో నిర్మించే కంప్యూటర్‌ సెంటర్‌కు భూమిపూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు.
  • క్యాంపస్‌లోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
  • అనంతరం కడప విమానాశ్రయానికి అక్కడి నుండి విజయవాడకు చేరుకొని మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.