బాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యలు జరుగుతున్నాయి: జగన్

బాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యలు జరుగుతున్నాయి: జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మా కుటుంబంలో హత్యలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ రోజు ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ... సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని కిరాతకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి వైఎస్ వివేకానంద రెడ్డిని కత్తులతో నరికి హత్య చేశారు. ఈ కేసులో దర్యాపు జరుగుతున్న తీరుపై అనుమానాలున్నాయి. బెడ్ రూమ్ లో చంపేసి బాత్ రూమ్ వరకు తీసుకెళ్లారు. బాత్ రూమ్ లో రక్తాన్ని పోశారని జగన్ ఆరోపించారు. డ్రైవర్ మీద నెపం నెట్టడానికి లెటర్ సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. విచారణ జరుపుతున్న అధికారులకు నా కళ్ళ ముందే ఫోన్లు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే అధికారులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మా నాన్న మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణకు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ వాళ్లే చేయిస్తారు.. మళ్లీ వాళ్లే సిట్‌ వేయిస్తారు. థర్డ్‌పార్టీతో విచారణ చేయిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.