'స్కామ్‌ల ఆధారాలు పూడ్చేసే పనిలో చంద్రబాబు..!

'స్కామ్‌ల ఆధారాలు పూడ్చేసే పనిలో చంద్రబాబు..!

గత ఐదేళ్ల కాలంలో తన పాలనలో చేసిన అనేక స్కామ్‌లకు సంబంధించిన ఆధారాలను పూడ్చేసే పనులను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా నిధులు, చెక్కులు ఇస్తున్నారని... దీనిని నియంత్రించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. చంద్రబాబు.. సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు వైఎస్ జగన్. నారా చంద్రబాబు లాంటి దుర్మార్గుడు, రాక్షసుడు, నేరగాడు, అన్యాయస్థుడు.. ఎంత త్వరగా పోతే.. అంత త్వరగా రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత.