ఆ స్టార్ హీరోకు షాకిచ్చిన జగన్...!!

ఆ స్టార్ హీరోకు షాకిచ్చిన జగన్...!!

జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.  2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిగా చేశారు. దీంతో అక్కడ అనేకమంది భూములు కొనుగోలు చేశారు.  కొత్త రాజధాని కాబట్టి రియల్ భూమ్ వస్తుందని చెప్పి పెట్టుబడులు పెట్టారు.  వ్యాపారవేత్తలతో పాటుగా కొంతమంది సినీస్టార్స్ కూడా అక్కడ భూములు కొనుగోలు చేశారు.  

అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం సినిమాలో మాదిరిగా ట్విస్ట్ ఇవ్వడంతో వారంతా షాక్ అయ్యారు.  ఓ టాలీవుడ్ టాప్ హీరో తన వాళ్ళచేత దాదాపుగా రూ. 500 కోట్ల రూపాయలతో అమరావతి పరిధిలో భూములు కొనిపించారని తెలుస్తోంది.  జగన్ మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో అక్కడ భూములు కొన్న వ్యక్తులు షాక్ అవుతున్నారు.  ఇంతకీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.