సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తా: జగన్

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తా: జగన్

సంక్షేమ పథకాలు ప్రజలు అందరికీ అందేలా చూస్తానని వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ రోజు నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం సభకు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ సభలో జగన్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలు అందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. బాబు తీరు దొంగతనం చేసిన వాడే దొంగ అని అరిచినట్టు ఉందని జగన్ విమర్శించారు.