ఉద్వేగానికి లోనైన వైఎస్‌ విజయమ్మ

ఉద్వేగానికి లోనైన వైఎస్‌ విజయమ్మ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా పలు విషయాలపై కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2,250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు తెలిపిన ఆయన.. పెన్షన్‌పై మొదటి సంతకం పెట్టారు. ఈ సందర్భంగా తనను అఖండ మెజార్టీతో గెలిపించి సీఎంను చేసిన ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించారు. 

"సంక్షేమ పథకాలు అందరూ నావాళ్లే అని భావిస్తాను. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు చూపించి.. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆశీర్వదించిన దేవుడికి, నాన్నగారికి, నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అని సీఎం తన ప్రసంగం ముగించారు. ఈ సందర్బంగా ప్రజలకు అభివాదం చేసిన వైఎస్‌ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు.