జగన్‌ ప్రమాణస్వీకార వేదిక ఖరారు...

జగన్‌ ప్రమాణస్వీకార వేదిక ఖరారు...

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకుని ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే, భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పలు ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు, అధికారులు... చివరకు విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంను ఖరారు చేశారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ ఠాకూర్‌,  విజయవాడ సీపీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌.. తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఫైనల్ చేశారు. కాగా, ఈ స్టేడియం కెపాసిటీ 40 వేలు. ఇక 30వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.