వడదెబ్బతో జగన్ పాదయాత్రకు బ్రేక్...

వడదెబ్బతో జగన్ పాదయాత్రకు బ్రేక్...

వడదెబ్బ కారణంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన... ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ... నిన్న ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాడా,  వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, జలుబుతో బాధపడుతున్న జగన్... వైద్యుల సలహాతో నేడు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో మహాసంకల్ప యాత్రకు ఒక రోజు బ్రేక్ పడింది. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించిన... ఈ ఒక్కరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి... రేపటి నుంచి యథావిథిగా పాదయాత్ర కొనసాగించాలని భావిస్తున్నారు వైఎస్ జగన్.