బాబాయ్‌ భౌతికకాయం వద్ద జగన్ కన్నీరు..

బాబాయ్‌ భౌతికకాయం వద్ద జగన్ కన్నీరు..

హత్యకు గురైన తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెల్లవారుజామున వైసీపీ మేనిఫెస్టోపై సీనియర్‌ నేతలతో వైఎస్ జగన్‌ సమావేశంలో ఉండగా... వివేకానందరెడ్డి మరణవార్త తెలియజేశారు కుటుంసభ్యులు. హెలికాప్టర్‌ ద్వారా పులివెందుల చేరుకునేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించినా... చాపర్ అందుబాటులో లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు చేరుకున్నారు. అప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసి.. వివేకా భౌతికకాయాన్ని ఇంటికి తరలించగా.. నేరుగా వివేకా నివాసానాకి వెళ్లిన వైఎస్ జగన్.. బాబాయ్ భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులను అడిగి ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు.