బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జగన్

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పొట్లూరి వరప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రికి వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు. అనంతరం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి బయల్దేరి వెళతారు.