ఖాకీ చొక్కా వేసిన జగన్...

ఖాకీ చొక్కా వేసిన జగన్...

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'ఖాకీ చొక్కా' వేశారు... ప్రజాసంకల్పయాత్ర కేతరాజుపల్లెకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిశారు గోపాలమిత్రలు, ఆటో సంఘాల ప్రతినిధులు... ఈ సందర్భంగా జగన్ కు ఖాకీ చొక్కా, ఆటో జ్ఞాపికలను బహూకరించారు యూనియన్ నేతలు. ఆటో సంఘాల నేతలు ఇచ్చిన ఖాకీ చొక్కాను ధరించి... వారు అందించిన ఆటో జ్ఞాపికను అందుకున్నారు జగన్.