వైఎస్ జగన్ బస్సు యాత్ర రద్దు

వైఎస్ జగన్ బస్సు యాత్ర రద్దు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సుయాత్ర రద్దు అయింది. పాదయాత్ర ముగియగానే బస్సుయాత్రను నిర్వహించాలని తొలుత జగన్ భావించారు. బస్సుయాత్ర ప్రారంభించేలోగానే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలకు ఇంకో 27 రోజులు మాత్రమే ఉండటంతో బస్సుయాత్రను రద్దు చేసుకున్నారు.

అయితే లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన తరువాత ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకోసం జగన్ హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. గురువారం విజయవాడలోని రామవరప్పాడు దగ్గర జరిగే సమరశంఖారావ సభలో జగన్ పాల్గొననున్నారు.