ఇద్దరూ ఎన్నికలకు ముందే..

ఇద్దరూ ఎన్నికలకు ముందే..

సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, ఆయన తండ్రి, వైఎస్ రాజారెడ్డి.. ఇద్దరూ సార్వత్రిక ఎన్నికలకు ముందే హత్యకు గురికావడం చర్చనీయాశంగా మారింది. ఉమ్మడి ఏపీలో 1999 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 1998 మే 23వ తేదీన  కారులో వెళ్తున్న రాజారెడ్డిని ప్రత్యర్ధులు దారికాచి హత్య చేయగా... సార్వత్రిక ఎన్నికలకు మరో నెల రోజుల ముందే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురికావడం చర్చగా మారింది. అయితే, వైఎస్ రాజారెడ్డిది హత్య అయితే... వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించినట్టుగా తొలుత భావించారు కుటుంబసభ్యులు. కానీ, ఆయన మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పోస్ట్‌మార్టం నివేదిక కూడా వివేకాది హత్యేనని తేల్చింది.