రేపటి నుంచి వైఎస్ షర్మిల నిరాహారదీక్ష... ఒక్కరోజుకే అనుమతి... 

రేపటి నుంచి వైఎస్ షర్మిల నిరాహారదీక్ష... ఒక్కరోజుకే అనుమతి... 

వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో వైఎస్ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. చెప్పిన విధంగానే ఆమె నిరాహార దీక్షకు దిగబోతున్నారు.  

అయితే, ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు.  ఒక్కరోజు మాత్రమే అదీకూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చారు.   దీంతో టెన్షన్ లోటస్ పాండ్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  మరి షర్మిల మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తారా లేదంటే ఒక్కరోజు మాత్రమే చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.