యాత్రపై వైఎస్ విజయమ్మ స్పందన

యాత్రపై వైఎస్ విజయమ్మ స్పందన

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకొని యాత్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ సినిమాపై ఇటీవలే వైఎస్ జగన్ స్పందించిన సంగతి తెలిసిందే.  తాజాగా వైఎస్ విజయమ్మ ఈ సినిమా గురించి స్పందించారు.  

ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈ సినిమాను వైఎస్ విజయమ్మ తిలకించారు.  అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను యాత్ర రూపంలో తెరకెక్కించిన తీరు బాగుందని అన్నారు.  ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ కు, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని మరోసారి ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారని ఆమె పేర్కొన్నారు.  రాజశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆదరించారని, ఇప్పుడు వారి పిల్లలను కూడా ప్రజలు ఆదరిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.