వైఎస్ వివేకా మృతిపై పోలీసులకు ఫిర్యాదు

 వైఎస్ వివేకా మృతిపై పోలీసులకు ఫిర్యాదు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలపై గాయాలు ఉండటంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌ మార్టం నిర్వహించనున్నారు. గురువారం రోజంతా మండుటెండలో తిరిగి వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి ఇంటికి చేరుకునే సరికి చాలా ఆలస్యమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో... అలసి అలాగే పడుకుండిపోయారు. శుక్రవారం తెల్లవారు జామున బాత్‌రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించారు.