కుట్రలో సూత్రదారులు చంద్రబాబు, లోకేష్: విజయసాయిరెడ్డి

కుట్రలో సూత్రదారులు చంద్రబాబు, లోకేష్: విజయసాయిరెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రదారులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఐతే.. మరో సూత్రధారి ఆదినారాయణ రెడ్డి అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నీచమైన చర్య. వివేకానంద రెడ్డి పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం పదునైన కత్తితో దాడి చేశారని తెలుస్తుందని మండిపడ్డారు. 1998 నుండి 2019 వరకు వైఎస్ కుటుంబాన్ని అంతం చేయలని తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ అని అందరికి తెలుసు. రాజా రెడ్డిని చంపిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రక్షణ కలిగించారని విజయసాయిరెడ్డి తెలిపారు.

అనంతరం అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందో..! ఫినిష్ అయిపోతారు అని వ్యాఖ్య లు చేసిన కొన్ని రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఆదినారాయణ రెడ్డి మనిషి కాదు దుర్మార్గుడు. ఈ కుట్రలో సూత్ర దారులు చంద్రబాబు, లోకేష్ ఐతే మరో సూత్రధారి ఆదినారాయణ రెడ్డి అని ఆరోపించారు. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగితే గంటలో డిజీపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ పోలీసులు వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. సీబీఐకి ఈ కేసు అప్పగించాలని అయన డిమాండ్ చేసారు. ఇప్పుడు వేసిన సిట్ డీజీపీ ఆద్వర్యంలో పనిచేస్తోంది. గతంలో ఎన్నో సీట్ వేశారు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి లోక్ సభ టికెట్ ఏనాడు అడగలేదు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. టీడీపీ మాత్రం దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు.