గుండె పోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి

గుండె పోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడే వివేకానందరెడ్డి. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. గతంలో కడప నుంచి లోక్ సభకు వివేకా ప్రాతినిథ్యం వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు.