ఇవాళ వైఎస్ వివేకా అంత్యక్రియలు

ఇవాళ వైఎస్ వివేకా అంత్యక్రియలు

హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనుండగా.. పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా, వైఎస్ వివేవానంద రెడ్డి మొదట గుండెపోటుగా భావించారు... అయితే, పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత హత్యగా తేల్చారు. తల, ఛాతి, చేతి, తొడపై ఇలా ఏడుచోట్ల బలమైన గాయాలను గుర్తించారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వైఎస్ వివేకా.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తమ్ముడు.