వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి..

వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి..

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అజాత శత్రువుగా పేరున్న వైఎస్ వివేకాను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు పలికారు.