వైఎస్‌ వివేకాది హత్యే..

వైఎస్‌ వివేకాది హత్యే..

వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు నిజమయ్యాయి. ఆయనది సహజ మరణం కాదు.. హత్యే అంటున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం నివేదికలో మర్డర్‌గా తేలిందని వెల్లడించారు. మొదట గుండెపోటుతో మృతిచెందారని భావించారు. అయితే, ఒంటిపై బలమైన గాయాలు ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. వివేకానంద పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా తేలిందంటున్నారు పోలీసులు. హత్య జరిగినట్లు నిర్ధారించారు ఫోరెన్సిక్ నిపుణులు... వైస్ వివేక్ మృతదేహం పైన ఏడు చోట్ల గాయాలు ఉన్నాయని వెల్లడించారు. కత్తితో ఆయనపై దాడి చేసినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. మరోవైపు వివేకాను ఎవరు? ఎందుకు? చంపారు అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.