వివేకా హత్య: పరమేశ్వరన్ కీలకం

వివేకా హత్య: పరమేశ్వరన్ కీలకం

వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఐదు బృందాలను నియమించి విచారణ చేస్తోంది. మరోవైపు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పర్యవేక్షణలో ఏడు బృందాలు కూడా కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. ఎస్పీ ఇప్పటివరకు 20 మంది సాక్షులను విచారించారు. వివేకా దగ్గరి బంధువులు ఆరుగురిని ఆదివారం పులివెందుల పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఎస్పీ విచారణ చేశారు.

అయితే వైఎస్‌ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న కసునూరి పరమేశ్వర్‌ రెడ్డిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ వివేకాకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నపరమేశ్వర్‌ రెడ్డి హత్య అనంతరం పరారీలో ఉన్నాడు. ఇతడు గతంలో నాలుగు హత్య కేసుల్లో నిందుతుడు కూడా. హత్య జరిగిన రోజు ఉదయం వరకు ఇంట్లోనే ఉన్న పరమేశ్వర్‌ రెడ్డి దంపతులు గత నాలుగు రోజులుగా కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాలో పరమేశ్వర్‌ రెడ్డి పేరు రాగానే పరారీలో ఉన్నారు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పరమేశ్వర్‌ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారని అంటున్నారు. ఏదేమైనా పరమేశ్వర్‌ రెడ్డి దొరికితే కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది.