ఈసీకి వివేకా కుమార్తె ఫిర్యాదు..

ఈసీకి వివేకా కుమార్తె ఫిర్యాదు..

సచివాలయంలో ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి కలిశారు. సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని సునీత ఫిర్యాదు చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని సునీత తెలిపారు.