వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ఫస్ట్ లుక్ రిలీజ్

వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ఫస్ట్ లుక్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగవంత నేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర టైటిల్ తో ఓ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. నిన్ననే టైటిల్ లోగో పోస్టర్ ను రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా చిత్రబృందం ఇవాళ మరో సర్ప్రైజ్ తో అలరిస్తోంది. అదే ఫస్ట్ లుక్ పోస్టర్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించనున్నాడు. ఇప్పుడొచ్చిన పోస్టర్ ను మమ్ముట్టి అచ్చం వైఎస్ లానే తెలుపు రంగు జుబ్బా, పంచె కట్టుతో అద్భుతంగా ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రకు ఇతనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనేలా..నడకలో శైలి, అభివాదం చేసే స్టయిలే అన్ని అచ్చుగుద్ది నట్టు కనిపిస్తున్నాయి. ఈ బయోపిక్ ను మహి రాఘవ్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగానే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో స్క్రిప్ట్ పనులు కూడా సజావుగా సాగడంతో ఈనెల 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పాత్రలో తమిళ నటుడు సూర్య నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును 70MM ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మించనున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి ఎలా మెప్పించాడో మీరు ఓ సారి చూసెయ్యండి. Yatra