యాత్ర కన్ఫర్మ్ అయింది..!!

యాత్ర కన్ఫర్మ్ అయింది..!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా రూపొండుతున్న  సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.  వైఎస్ చేపట్టిన పాదయాత్ర గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.  ఈ దిశలోనే సినిమా ఉండబోతుందని సమాచారం.  మహి దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకుంది.  

డిసెంబర్ 21 వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ వర్గాలు చెప్తున్నాయి.  డిసెంబర్ 21 న వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఆరోజేనే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  వైఎస్ బయోపిక్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళం స్టార్ హీరో మమ్మూట్టి చేస్తున్న సంగతి విదితమే.  ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, అనసూయ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.