షాకిస్తున్న యాత్ర రన్ టైమ్..!!

షాకిస్తున్న యాత్ర రన్ టైమ్..!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర.  మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను బేస్ చేసుకొని ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది.  బయోపిక్ సినిమా అంటే అటు ఇటుగా రెండున్నర లేదంటే మూడు గంటల నిడివి ఉంటుంది.  యాత్ర సినిమా అందుకు విరుద్ధంగా గంటా 57 నిమిషాల మాత్రమే నిడివి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  రెండు గంటల కంటే తక్కువ సమయంలో దర్శకుడు మహి బయోపిక్ సినిమాలో ఏం చూపించి ఉంటాడనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.  

ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది.  అంచనాలను పెంచింది.  ఈ సినిమా పూర్తయ్యాక ఓ యాత్ర గురించి ఓ సాంగ్ ఉంటుందట.  రచయిత పెంచల్ దాస్ రాసిన ఈ పాట కన్నీళ్లు తెప్పిస్తుందని అంటున్నారు.