యాత్ర పూర్తయింది..!!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ వంటి థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించిన మహి రాఘవ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
డిసెంబర్ 21 న సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. 70 ఎమ్ఎమ్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 21 న అంతరిక్షం 9000కిలోమీటర్లు, పడిపడిలేచే మనసు వంటి సినిమాలతో పోటీ పడుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)