కర్రలు, గొడ్డళ్లతో వైసీపీ, టీడీపీ వర్గాల దాడులు..!

కర్రలు, గొడ్డళ్లతో వైసీపీ, టీడీపీ వర్గాల దాడులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో... పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన తర్వాత పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గాయాలపాలమైన వారిని ఆస్పత్రికి తరలించారు.