క్లీన్‌ స్వీప్ దిశగా వైసీపీ..

క్లీన్‌ స్వీప్ దిశగా వైసీపీ..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌ స్వీప్ దిశగా దూసుకుపోతోంది... 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో 144 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు లీడ్‌లో ఉండడం విశేషం.. ఇక అధికార తెలుగుదేశం పార్టీ 27 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన ఒక స్థానానికే పరిమితమైంది పోయింది. ఇటు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా... 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పార్టీ కీలక నేతలు... ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. వైసీపీ కార్యాలయం దగ్గర కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు.