పులివెందులకు వైఎస్ జగన్..

పులివెందులకు వైఎస్ జగన్..

ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పులివెందులలోనే గడపనున్నారు వైఎస్ జగన్. హైదరాబాద్‌ నుంచి ఇవాళ సాయంత్రానికి పులివెందుల చేరుకోనున్న వైసీపీ చీఫ్.. రాత్రికి అక్కడే బస చేస్తారు... బుధవారం, గురువారం పులివెందుల వైసీపీ కార్యాలయంలో జగన్‌ ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.