'వంచనపై గర్జన'

'వంచనపై గర్జన'

ఓ వైపు విజయవాడలో సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేపడుతుంటే మరోవైపు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధించడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి వైసీపీ సైతం సిద్ధమైంది... హోదా విషయంలో సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ 'వంచనపై గర్జన దీక్ష' అనే పేరుతో నెల్లూరులో భారీ సభ నిర్వహిస్తోంది వైసీపీ. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో జరిగే ఈ సభకు వైసీపీ శ్రేణులను భారీ తరలిస్తున్నారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నల్ల బ్యాడ్జ్ ధరించి పాదయాత్రలో పాల్గొననున్నారు.