జగన్‌కు శరద్‌ యాదవ్ ఫోన్‌ వార్తలపై అంబటి..

జగన్‌కు శరద్‌ యాదవ్ ఫోన్‌ వార్తలపై అంబటి..

ఎగ్జిట్ పోల్స్‌తో దేశ రాజకీయాల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చినా.. మరోవైపు ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ సోమవారం ఫోన్ చేశారని.. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌కు శరద్ యాదవ్ ఫోన్ చేసారన్నది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం పూర్తిస్థాయి ఫలితాలొచ్చిక తర్వాత జాతీయ రాజకీయాల్లో మా పార్టీ పాత్రను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జగన్‌కు శరత్ యాదవ్ కానీ, సోనియా గాంధీ గానీ ఫోన్ చేశారనేది కేవలం ప్రచారం మాత్రమే.. 23వ తేదీ తర్వాత కేంద్ర రాజకీయాలపై మా నాయకుడు జగనే స్పష్టత ఇస్తారని వెల్లడించారు. అయితే, హోదా ఇచ్చేపార్టీకే ప్రధాన్యత ఉంటుందన్నారు అంబటి రాంబాబు.