'అప్పటి నుంచే చిత్ర విచిత్రంగా బాబు ప్రవర్తన..!'

'అప్పటి నుంచే చిత్ర విచిత్రంగా బాబు ప్రవర్తన..!'

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని సెటైర్లు వేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వెయ్యిశాతం గెలుస్తున్నామని చెప్పుకోవల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ ల లెక్కింపుపై కూడా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదన్న అంబటి... చంద్రబాబు తన ఓటమికి కారణాలను ఈవీఎంలపై నెట్టేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంలను వాడి గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఈవీఎంలపై నెపం నెట్టితున్నారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 23న కౌంటింగ్ కేంద్రాల దగ్గర తెలుగు దేశం నాయకులు అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు.. పోలీసులు, ఎన్నికల అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.