దోచుకున్నదంతా కక్కిస్తాం..!

దోచుకున్నదంతా కక్కిస్తాం..!

ఏపీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి దేవినేని... పోలవరం ప్రాజెక్టులో దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. దేవినేని ఉమా బుద్దిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డి అంబటి.. పందికొక్కుల్లా తిన్నారు.. ఐదేళ్లుపాటు దోచుకున్నవాటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. మరోవైపు బుద్దా వెంకన్న తొడ కొడితే తొడలు వాస్తాయి తప్ప.. దాంతో ఉపయోగం లేదని సెటైర్లు వేశారు అంబటి. ఎగ్జిట్ పోల్స్‌ను చూసే టీడీపీ నేతలంతా భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.