బాబు, రాహుల్‌ది అపవిత్ర కలయిక...

బాబు, రాహుల్‌ది అపవిత్ర కలయిక...

చంద్రబాబు, రాహుల్ గాంధీ కలయిక అపవిత్ర కలయిక... స్వార్ధ అవసరాల కోసం కలయికని ప్రజలు విడ్డూరంగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ నేత పార్థసారథి... విజయం సాధించడం కోసం ఎవరితోనైనా కలుద్దామం అనే ఆలోచన లేని వ్యక్తి జగన్... కానీ, ఏ పార్టీతోనైనా పొత్తుకు టీడీపీ దిగజారిపోయిందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రం కోసం పలానా అభివృద్ధి చేశాను అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్ధితిలో చంద్రబాబు ఉన్నారన్న పార్థసారథి... చంద్రబాబు షెడ్యూల్ కార్యక్రమాలను రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లి అందరి కాళ్లు పట్డుకున్నారంటూ సెటైర్లు వేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలవడం ప్రజలు హర్చించబోరన్న వైసీపీ నేత... కేంద్రంలో చంద్రబాబు నాయకత్వం వలన ఒరిగేదేమీ లేదన్నరు. దేశంలో అప్రజాస్వామికంగా పుట్టిన నేత చంద్రబాబు... ఎన్టీఆర్ పైన చెప్పులు విసిరిన చంద్రబాబా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను ఏకపక్షంగా ఎదుర్కోలేని చంద్రబాబు  నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీని ఏ ఉద్దేశ్యంతో కలిశారో ఎన్టీఆర్ అభిమానులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.