బాబుగారు అభద్రతతో కృంగిపోతున్నారు..

బాబుగారు అభద్రతతో కృంగిపోతున్నారు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగారు ఈ మధ్య అభద్రతా భావంతో కృంగి పోతున్నట్లుగా కనబడుతుందని అన్నారు వైసీపీ నేత పార్థసారధి. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రమంతా తిరుగుతూ పెడబొబ్బలు పెడుతూ 4 సంవత్సరాలుగా తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకపోగా.. 2022 నాటికి భారతదేశంలోనే నెంబర్ వన్ గా చేస్తానని చెప్తున్నారని తెలిపారు. అలాగే... 2050కి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఏపీని నిలబెడతామని మీరెలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్ర డీజీపీ... బాధితులపై మీ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లనే చర్యలు తీసుకోలేక పోతున్నామని అనడం చంద్రబాబు నాయుడు పరిపాలనలోని లోపాలను ఎండగట్టడమేనని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా సింగపూర్ కు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రజలను 4 ఏళ్లుగా మోసం చేస్తున్నారని పార్థసారధి తెలిపారు.