వైసీపీ నేత సంచలనం.. మహిళా సీఎంను చూడాలని ఉంది..! ఎవరా సీఎం..?

వైసీపీ నేత సంచలనం.. మహిళా సీఎంను చూడాలని ఉంది..! ఎవరా సీఎం..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్ (పీవీపీ) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఇక, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే... తనపై విజయం సాధించిన టీడీపీ ఎంపీ కేశినేని నానితో చాలా రోజులు ట్విట్టర్ వార్ నడిచింది... ప్రశ్నలు, విమర్శలతో మొదలై.. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.. ఇదంతా ఓవైపు.. మరోవైపు ఏంటంటే..? తాజాగా పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఏమిటా కథ? అనే దానిపై క్లారిటీ లేకపోయినా.. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేసి.. కాకరేపారు పీవీపీ.

ఇవాళ ఉదయం ఇలా ట్వీట్ చేసి.. పెద్ద చర్చకు తెరలేపారు పీవీపీ..."బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనని పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీమ్‌కోర్ట్. ఆనాడు, అన్న ఎన్టీఆర్‌ గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియచేసారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం.'' అంటూ ట్వీట్ చేశారు పీవీపీ. అయితే, ఆయన ఉద్దేశం ఏంటి..? అసలు.. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న ఆ మహిళా నేత ఎవరు? అనే చర్చ సాగుతోంది. ఇక, తన ట్వీట్‌ను కాసేపటికే డెలిట్ చేశారు పీవీపీ... అసలు ముదుర్లు ఎక్కువగా ఉండే సోషల్ మీడియాలో పీవీపీ చేసిన ట్వీట్‌ను అప్పటికే స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు... ఆ మహిళా సీఎం ఎవరబ్బా? అనే ఆలోచనలోనూ పడ్డారు ప్రజలు... వైఎస్ భారతి కావొచ్చా? వైఎస్ షర్మిల సీఎం అవుతారా? లేదా వైఎస్ విజయమ్మ సీఎం పీఠం ఎక్కుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.