'సీబీఐ విచారణ జరిపించాలి..'

'సీబీఐ విచారణ జరిపించాలి..'

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాసిరెడ్డి పద్మ.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానందరెడ్డి జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు.. ఆయన నిన్న ప్రచారానికి కూడా వెళ్లారు. అలాంటి ఆయన అనుమానాస్పదంగా మరణించడం చాలా అనుమానాలకు దారి తీస్తోందన్నారు. వివేక మృతిపై సీబీఐ విచారణ చేయాలని కోరిన వాసిరెడ్డి పద్మ... కడపలో ఆదినారాయణరెడ్డి ఎలాంటి ఆకృత్యాలు చేస్తున్నారు ప్రదలందరికీ తెలుసున్నారు. కడపలో గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది.. దానికోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడడం లేదని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ.