వర్మ చేసిన తప్పేంటి...!!

వర్మ చేసిన తప్పేంటి...!!

రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికి అయోమయం నెలకొంది.  ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఏపిలో మే 1 వ తేదీన రిలీజ్ చేసేందుకు వర్మ సిద్ధం అవుతున్నాడు.  సినిమా రిలీజ్ విషయంపై ఏపీకి వెళ్లిన వర్మ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  వర్మను ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  

కాగా, వర్మ ప్రెస్ మీట్ అరెస్ట్ పై సినీనటుడు విజయ్ చందర్ స్పందించాడు.  ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు పబ్లిసిటీ ఘనంగా ఇచ్చుకున్న బాబు, లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు.  రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బాబు కాలరాస్తున్నారని అన్నారు.  ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ఒక న్యాయం, వర్మ సినిమాకు మరో న్యాయమా అని ప్రశ్నించాడు విజయ్ చందర్.